Telugu Gateway
Cinema

వాళ్ళిద్దరూ మళ్ళీ జోడీ కట్టారు

వాళ్ళిద్దరూ మళ్ళీ జోడీ కట్టారు
X

ఇదేదో హీరో..హీరోయిన్ల విషయం కాదు. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల సంగతి. వీళ్ళిద్దరూ కలసి సినిమా అంటే రచ్చ రచ్చే. అందుకు వీళ్లిద్దరి గత సినిమాలే ఉదాహరణ. ఈ కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’(2010), ‘లెజెండ్‌’(2014) సినిమాలు బాలయ్య అభిమానులను విశేషంగా ఆదరించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది డిసెంబరులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవి చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘బోయపాటి శ్రీను ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఇందులో బాలకృష్ణ మాస్‌ లుక్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓ ప్రధాన సమస్యకు కొన్ని కమర్షియల్‌ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నాం అని చెబుతోంది చిత్ర యూనిట్.

Next Story
Share it