Telugu Gateway
Andhra Pradesh

గంటా ‘రాజకీయ వ్యాపారి’

గంటా ‘రాజకీయ వ్యాపారి’
X

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. గంటా ఓ రాజకీయ వ్యాపారి అని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల్లో ఆఫర్‌ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని వ్యాఖ్యానించారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని ఆరోపించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్‌ విసిరారు.

పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ముఖ్యమని అవంతి ఉద్ఘాటించారు. గెలిచిన తర్వాత నియోజకవర్గం (విశాఖ ఉత్తరం)లో కనిపించకుండా పోయిన ఎమ్మెల్యే గంటా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవంతిని మంత్రిగా పరిగణించడంలేదన్న గంటా వ్యాఖ్యలపై కూడా ఆయన సీరియస్‌ అయ్యారు. తనతో పెట్టుకుంటే గంటా విశాఖలో తిరగలేరని మంత్రి హెచ్చరించారు.

Next Story
Share it