Telugu Gateway
Andhra Pradesh

జగన్ ‘రికార్డు’

జగన్ ‘రికార్డు’
X

ఒకేసారి ఏపీలో 1,26,728 శాశ్వత ఉద్యోగాలు కల్పించటం ఓ రికార్డు అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నాడు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి రెండేళ్ళ పాటు ప్రొబేషనరి పిరియడ్ గా ఉండనుంది. ఈ సమయంలోనూ వారికి నెలకు 15వేల రూపాయల వేతనం చెల్లిస్తారు. వీరంతా అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఏకంగా 19.74 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. ఫలితాల వెల్లడి అనంతరం ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ చరిత్రలో ఒకేసారి లక్షా ఇరవై ఆరు వేల ఏడువందల ఇరవైఎనిమిది ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసిన అపూర్వ ఘట్టం ఇప్పుడు జరుగుతోందని అన్నారు.

గ్రామ,వార్డు సచివాలయాల కార్యదర్శుల ఉద్యోగాల పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ ఫలితాలను సిద్దం చేసిన అదికారులను ఆయన ప్రశంసించారు. రికార్డు సమయంలో యజ్ఞంలా చేశారని అన్నారు.. అంకితభావంతో పరీక్షలు నిర్వహించడంలో మంచి పనితీరు కనపరిచారని ప్రశంసించారు. ఎన్నికల హామీలో చెప్పినట్టుగా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఒకే నోటిషికేషన్‌ ద్వారా 1,26,728 శాశ్వత ఉద్యోగాలను కల్పించడం చరిత్రలో తొలిసారిగా ఆయన అబివర్ణించారు. ఉత్తీర్ణులైన వారికి జగన్ అభినందనలు తెలిపారు.

Next Story
Share it