Telugu Gateway
Cinema

యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్

యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్
X

‘అల వైకుంఠపురము’లో అంటూ అల్లు అర్జున్ హంగామా చేస్తున్నాడు. గ్యాప్ ఇవ్వలేదు..వచ్చింది అంటూ తన సినిమా ఆలస్యానికి అభిమానులకు వివరణ ఇచ్చిన తీరులో సినిమా ప్రచారం మొదలుపెట్టి ఆకట్టుకున్నాడు ఈ స్టైలిష్ స్టార్. ప్రస్తుతం అల వైకుంఠపురము సినిమాకు సంబంధించి యాక్షన్ సీన్స్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ ను తెరకెక్కిస్తున్నారు.

ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌ – లక్ష్మణ్‌ సారథ్యంలో ఈ ఫైట్‌ సీన్స్‌ తెరకెక్కుతున్నాయి. ఇది ముగిసిన తర్వాత షెడ్యూల్ విదేశాలకు వెళ్ళనుంది. సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, టబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. దసరా పండగకి ఓ ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Next Story
Share it