తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్
BY Telugu Gateway16 Aug 2019 2:51 PM GMT
X
Telugu Gateway16 Aug 2019 2:51 PM GMT
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా సీఎం కొనసాగుతారు. వినోద్ కుమార్ కు కేబినెట్ ర్యాంకుతో ఈ పదవి కట్టబెట్టారు. కేబినెట్ సమావేశాలకు కూడా ఆయన శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారని చెబుతున్నారు.
వినోద్ కుమార్ మూడేళ్ల పాటు నూతన బాధ్యతల్లో కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర భౌగౌళిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న వినోద్ కుమార్ ఈ పదవికి సరైన న్యాయం చేస్తారని భావించే ఆయనకు ఈ పదవి అప్పగించినట్లు సీఎం పేర్కొన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు కెసీఆర్ ఈ పదవి కట్టబెట్టారు.
Next Story