Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

విజయ్ కొత్త సినిమా టైటిల్ ‘ఫైటర్’

0

విజయదేవరకొండ, పూరీ జగన్నాధ్  కాంబినేషషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ మ్యాజిక్ పనిచేయలేదనే చెప్పాలి. విజయ్, రష్మిక మందన నటించిన  ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతంగా చేసుకోగా..కలెక్షన్లు కూడా నిరాశపర్చాయి. దీంతో సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ తో కలసి  కొత్త సినిమాకు ఓకే  చెప్పాడు  ఈ యువహీరో.

- Advertisement -

ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నా దీనిపై ఇంత వరకూ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ లో విజయ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని చెబుతున్నారు. ప్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుని జనవరి నుంచి చిత్రీకరణ మొదలు కానుంది.

Leave A Reply

Your email address will not be published.