మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ
BY Telugu Gateway8 Aug 2019 2:37 PM IST

X
Telugu Gateway8 Aug 2019 2:37 PM IST
అటు నన్నపనేని రాజకుమారి రాజీనామా. ఇటు వాసిరెడ్డి పద్మకు పోస్టింగ్. ఏపీ నూతన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది.
గత కొన్ని రోజులుగా వాసిరెడ్డి పద్మకు ఈ పదవి ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అన్నట్లుగానే నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసిన వెంటనే ఆమెకు పదవి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story