Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ పొలిట్ బ్యూరోలో అయ్యన్న కంటతడి

టీడీపీ పొలిట్ బ్యూరోలో అయ్యన్న కంటతడి
X

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన అత్యున్నత నిర్ణాయక బాడీ అయిన పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాడు గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించారు. తెలుగుదేశం పార్టీకి కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు, మాదిగలు పార్టీకి దూరం అయినట్లు గుర్తించారు. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి చేరువ చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు..ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కంటతడి పెట్టుకున్న వ్యవహారం కొద్దిసేపు కలకలం రేపింది.

ఎన్నికల్లో ఎంతో చేసినా ఓటమి చెందటం బాధించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. టీడీపీ ఎంతో చేసినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే మొగ్గుచూపారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. పార్టీని తిరిగి పునరుత్తేజం చేయాలంటే పొలిట్ బ్యూరో తోపాటు క్షేత్రస్థాయి నుంచి అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులతోపాటు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఎన్నికల ముందు వరకూ బిజెపి తీసుకున్న నిర్ణయాలు అన్నింటిని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం తన వైఖరి మార్చుకున్నట్లు కన్పిస్తోంది.

Next Story
Share it