Telugu Gateway
Andhra Pradesh

రాజధాని మారుస్తామని జగన్ చెప్పారా?

రాజధాని మారుస్తామని జగన్ చెప్పారా?
X

ఏపీ రాజధాని అమరావతిపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. కొంత మంది మంత్రులు రాజధాని మారదు అని చెబుతుంటే..మరికొంత మాత్రం అక్కడ ఉండటం అనుమానమే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నామని సీఎం జగన్ చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని మార్పు అంశంలో జరుగుతున్న ప్రచారాలు అన్నీ అపోహలేనని వ్యాఖ్యానించారు. రైతులను ఎలా సంతృప్తిపరచాలో ముఖ్యమంత్రి చూసుకుంటారన్నారు.

శివరామకృష్ణ కమిటీ చెప్పిన రిపోర్ట్‌ నే మంత్రి చెప్పారు కానీ ప్రభుత్వ అభిప్రాయం కాదని తెలిపారు. మాజీ స్పీకర్ కోడెల ఘటన దురదృష్టకరమన్నారు. ఇదో మాయని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఒక్క పౌరుడితో అనిపిస్తే తన పదవి నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని వ్యాఖ్యానించారు తమ్మినేని.

Next Story
Share it