Telugu Gateway
Cinema

‘సైరా’ టీజర్ ఆగస్టు20న

‘సైరా’ టీజర్ ఆగస్టు20న
X

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహరెడ్డి టీజర్ విడుదల ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 20న టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత రామ్ చ రణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తెలుగు టీజర్‌కు పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు.

Next Story
Share it