Telugu Gateway
Cinema

‘సైరా’ టీజర్..దుమ్మురేపిన చిరు

‘సైరా’ టీజర్..దుమ్మురేపిన చిరు
X

అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ‘సైరా’ నరసింహరెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూటన్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ చారిత్రక చిత్రంలో నరసింహరెడ్డి పాత్ర పోషించిన చిరంజీవి యాక్షన్ సన్నివేశాల్లో సూపర్బ్ అనేలా నటించారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పొచ్చు. ‘వీరాధి వీరులారా. చరిత్రలో మనం ఉండకపోవచ్చు. ఈ రోజు చరిత్ర మనతోనే మొదలవ్వాలి’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది. టీజర్ చూస్తుంబే బాహుబలి సినిమా తరహాలోనే భారీ వ్యయంతో సినిమాను తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా..సురేందర్‌ రెడ్డి దర్శకుడు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ కళ్యాణ్ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ తో విడుదల చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్‌, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

https://www.youtube.com/watch?time_continue=105&v=qZoWxaz2YPc

Next Story
Share it