తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
శ్రీశైలం జలాశయం ఇప్పుడు నిండు కుండలా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఇంకా భారీ ఎత్తున నీటి ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు గేట్లు తెరిచారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
వరస సెలవులతో హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు శ్రీశైలం ప్రాంతం అందాలను వీక్షించేందుకు వెళ్ళారు. దీంతో ప్రాజెక్టు ప్రాంతం అంతా ప్రజలతో సందడి సందడిగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా..ఇప్పటికే 880 అడుగులు దాటింది. దీంతో గేట్లు ఎత్తారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయంలోకి వేగంగా నీరు వచ్చింది చేరింది.