Telugu Gateway
Politics

అటు తిరిగి...ఇటు తిరిగి సోనియా దగ్గరే ఆగారు

అటు తిరిగి...ఇటు తిరిగి సోనియా దగ్గరే ఆగారు
X

కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు కన్పిస్తోంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి కూడా ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. బహుశా దేశంలో ఏ పార్టీ కూడా ఇంత గరందగోళంలో ఉన్నట్లు కన్పించదు. రాహుల్ గాంధీ ఏమో తనకు అధ్యక్ష పదవి వద్దే వద్దు..అంతే కాదు మా కుటుంబం నుంచి కూడా కొత్త అధ్యక్షుడు వద్దు అని చెబుతారు. ఇదే అంశంపై తేల్చలేక అలా నాన్చుతూ వచ్చిన పార్టీ చివరకు మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దగ్గర ఆగిపోయారు. ఇఫ్పుడు సోనియాగాంధీని తాత్కాలిక అధ్యక్షురాలుగా నిర్ణయిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతానికి ఆ పార్టీకి ఓ దిక్కు దొరికినట్లు అయింది. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఈ చర్చలో మరోసారి రాహుల్‌ గాంధీ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే రాహుల్‌ మరోసారి ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై సీడబ్ల్యూసీ తర్జన భర్జన పడింది. సుదీర్ఘ భేటి అనంతరం సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించాలని చివరికి సీడబ్ల్యూసీ నిర్ణయించింది. త్వరలో మరోసారి సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ ఉన్న క్లిష్ట సమయంలో సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో స్థైర్యం నింపగలరని సీడబ్ల్యూసీ భావించింది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ గులాంనబీ అజాద్‌ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూడటంతో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it