విజయదేవరకొండతో పూరీ జగన్నాధ్ మూవీ
BY Telugu Gateway12 Aug 2019 9:51 AM GMT

X
Telugu Gateway12 Aug 2019 9:51 AM GMT
ప్రచారం నిజమైంది. గత కొన్ని రోజులుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ సినిమా చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సోమవారం నాడు చార్మి కౌర్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లోనే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
పూరీ, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామంటూ ఛార్మి కౌర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన, ఛార్మి కలసి నిర్మించి ‘ఇస్మార్ట్ శంకర్’ వసూళ్ళ పరంగా మంచి ఫలితాలను సాధించింది. ఇదే జోష్ తో విజయ్ దేవరకొండతో సినిమాకు రెడీ అయ్యారు పూరీ, ఛార్మీ.
Next Story