Telugu Gateway
Politics

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు
X

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జర్నలిస్టులంటే చాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తారు. గతంలో ఓ జర్నలిస్టుపై అభ్యంతరకర పదజాలంతో విమర్శలు చేసిన కోటంరెడ్డి తాజాగా ఓ పత్రిక ఎడిటర్ ఇంటికెళ్ళి మరీ బెదిరించటం కలకలం రేపుతోంది. దీంతో ఆయనపై తాజాగా ఓ కేసు నమోదు అయింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్, ప్రత్రిక అధినేత అయిన డోలేంద్ర ప్రసాద్‌ మీద దాడి చేసిన ఘటనపై కేసు నమోదయింది. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనపై దాడిచేసి కొట్టారని ‘జమీన్‌ రైతు’ వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు కోటంరెడ్డి మాగుంట లేవుట్‌లో ఉన్న తన ఇంటికి బాగా మందుతాగి వచ్చారని డోలేంద్ర తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్‌ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారని చెప్పారు. వస్తూనే ‘‘ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో’’ అంటూ బెదిరించారని తెలిపారు. డోలేంద్ర ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story
Share it