Telugu Gateway
Andhra Pradesh

పట్టిసీమకు బ్రేక్

పట్టిసీమకు బ్రేక్
X

పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న లిఫ్ట్ స్కీమ్ లను ఆపేయాల్సిందిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పట్టిసీమతోపాటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు బ్రేక్ పడినట్లు అయింది. అయితే ప్రస్తుతం కృష్ణా డెల్టాకు అవసరమైన నీరు సాగర్ నుంచే వస్తుండటంతో ఇఫ్పుడు అసలు పట్టిసీమ అవసరమే ఉండదని చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు దక్కిన తర్వాతే ఈ ప్రాజెక్టులు నడపాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ వేసిన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పర్యావరణ శాఖ, ఎపి కాలుష్య నియంత్రణ మండలి తదితర సంస్థలు స్టడీ చేసి ఒక నివేదిక అందచేశాయి. దానిని పరిశీలించిన ట్రిబ్యునల్ దీనిపై ఈ ఉత్తర్వు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండా ఆయా స్కీములు చేపట్టిన సంగతి తెలిసిందే. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే చోద్యం చూస్తున్నారా? అంటూ ఎన్జీటీ కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి (సీపీసీబీ)తోపాటు ఏపీపీసీబీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story
Share it