గ్యాంగ్ లీడర్ ట్రైలర్ వచ్చింది
గ్యాంగ్ లీడర్..వాల్మీకి సినిమాల మధ్య పోటీని నివారించేందుకు మార్గం సుగమం అయిన విషయం తెలిసిందే. వాల్మీకి సినిమా సెప్టెంబర్ 20కి వాయిదాపడగా..గ్యాంగ్ లీడర్ మాత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది. అందులో భాగంగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే ఇది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్‌ఎక్స్ 100 ఫేం కార్తికేయ తొలిసారి ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని రివేంజ్ కథల రచయిత పెన్సిల్‌గా కనిపించనున్నాడు. రివేంజ్ రచయిత అయినా పెన్సిల్ ఐదుగురు ఆడవాళ్లు పగ తీర్చుకునేందుకు ఎలా సాయం చేశాడు అన్నదే గ్యాంగ్ లీడర్ కథ. నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు. సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=UGO1mTUYfOE