నాని ‘వి’ లుక్ వచ్చేసింది
న్యాచురల్ స్టార్ నాని గ్యాప్ లేకుండా షూటింగ్ ల్లో బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు ఒక సినిమా పూర్తి అయిందో లేదో..మరో వైపు కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఏ మాత్రం ఖాళీ లేకుండా పనులు పూర్తి చేస్తున్నాడు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఆగస్టు 30నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా...ప్రభాస్ సాహో కోసం సినిమా విడుదలను వాయిదా చేశారు.
నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఆయన కెరీర్ లో 25వ చిత్రం. ఆదివారం వి షూటింగ్‌కు హాజరయ్యాడు నాని. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నాడు. అదితిరావ్ హైదరీ, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి సినిమాలో నాని లుక్ సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.