Telugu Gateway
Telangana

కోదండరాం అరెస్ట్

కోదండరాం అరెస్ట్
X

తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేట మండలం నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కోదండరాం హజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు, పదర, అమ్రాబాద్ మండలాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. యురేనియం వెలికితీత వల్ల వాటిల్లే నష్టాల గురించి ప్రజలతో చర్చించడానికి వచ్చిన కోదండరామ్‌ బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడం సరైందని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it