Telugu Gateway
Cinema

‘జోడీ’ రెడీ అంటున్న ఆది

‘జోడీ’ రెడీ అంటున్న ఆది
X

ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా నటించిన ‘జోడీ’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శ్రద్ధా శ్రీనాధ్ తెలుగులో నటించిన తొలి సినిమా ‘జెర్సీ’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆమె రెండవసారి తెలుగులో కన్పించనున్న సినిమానే ఈ జోడీ.

గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story
Share it