గవర్నర్ నరసింహన్ తో జగన్ భేటీ
BY Telugu Gateway1 Aug 2019 10:18 AM GMT

X
Telugu Gateway1 Aug 2019 10:18 AM GMT
హైదరాబాద్ లో గురువారం నాడు కీలక పరిణామాలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరస పెట్టి తెలంగాణ గవర్నర్ నరసింహన్, ఆ తర్వాత సీఎం కెసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. గవర్నర్ నరసింహన్ తో సమావేశం అయిన తర్వాత జగన్ సీఎం కెసీఆర్ తో సమావేశం అయ్యారు. పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసమే ఈ భేటీ జరిగినట్లు చెబుతున్నారు. గవర్నర్ తో జగన్ భేటీ అరగంటపైనే సాగినట్లు సమాచారం.
ఈ నెలలో నీటి పంపకాలు, ఆస్తులపై ఇరు రాష్ట్రాల అధికారులు భేటీ కానున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నది. గురువారం సాయంత్రం జగన్ ప్రత్యేక విమానంలో బయలుదేరి ముంబయ్ వెళ్ళనున్నార. అక్కడ నుంచి ఆయన జెరూసలెం పర్యటనకు వెళుతున్నారు. తిరిగి ఐదవ తేదీని అమరావతికి చేరుకుంటారు.
Next Story