Telugu Gateway
Cinema

అనుష్కకు ఫోన్ చేసి అయినా చెబుతా!

అనుష్కకు ఫోన్ చేసి అయినా చెబుతా!
X

హీరో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అనుష్కా నువ్వు అయినా త్వరగా పెళ్లి చేసుకో అని ఫోన్ చేసి చెబుతా’ అన్నారు. వెండితెరపై విజయవంతమైన జంటగా పేరుగాంచిన ప్రభాస్, అనుష్కల ఎఫైర్ పై ఇఫ్పటికే పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. పలుమార్లు ఇద్దరూ తాము కేవలం స్నేహితులం మాత్రమే అని..ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదంటూ ఖండిస్తూ వచ్చారు. అయితే సరి మళ్ళీ మళ్ళీ ఇదే అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సాహో సినిమా ప్రమోషన్ లో ఉన్న ప్రభాస్ కు మరో సారి ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగానే ప్రభాస్ పై వ్యాఖ్యలు చేశారు. నేను లేదా అనుష్క ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటేనే(వేర్వేరు వ్యక్తులను) తప్ప ఈ వదంతులు ఆగేలా లేవు.

ఈ విషయం గురించి అనుష్కతో ఓసారి మాట్లాడాల్సిందే. ఇదిగో అనుష్క నువ్వైనా తొందరగా పెళ్లి చేసుకో అని తనకు చెబుతాను. అప్పుడే ఇటువంటి పుకార్లకు తెర పడుతుందేమో’ అని సరదాగా వ్యాఖ్యానించారు. నిజంగా తాము రిలేషన్‌షిప్‌లో ఉంటే ఏ ఇటలీలోనో, ఏదైనా బీచ్‌లోనో సంతోషంగా తిరిగేవాళ్లమే కదా అని ప్రశ్నించారు. అసలు ఇందులో దాచాల్సిన విషయం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికాడు. అనుష్కతో ప్రభాస్‌ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం లాస్‌ఏంజెల్స్‌ లో సాహో ప్రత్యేక షో వేయిస్తున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it