‘గుణ369’ మూవీ రివ్యూ
తొలి సినిమాతోనే సత్తా చాటిన హీరో కార్తికేయ. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కావటంతో వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయినా ఆర్ఎక్స్ 100 తర్వాత ఇప్పటి వరకూ సరైన హిట్ దొరకలేదు ఈ హీరోకు. శుక్రవారం నాడు కార్తికేయ నటించిన ‘గుణ369’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత సినిమాలతో పోలిస్తే గుణ369 కార్తికేయ మళ్లీ లైఫ్ లైన్ ఇచ్చిందనే చెప్పొచ్చు. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంద్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ఆడపిల్లలను వేధించే వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలన్న సందేశాన్ని కమర్షియల్ జానర్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు అర్జున్. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే గతంలో చాలా సినిమాల్లో చూసిన తరహాలోనే హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ చాలా రొటీన్ గా ఉంటుంది. అయితే హీరో కార్తికేయ మాత్రం యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా తన సత్తా చాటాడు. ఫస్ట్ హాఫ్ అంతా లవర్ బాయ్‌గా కనిపించిన కార్తికేయ సెకండ్ హాఫ్‌లో మాస్ యాక్షన్ సీన్స్ లోనూ తనదైన స్టైల్ లో సత్తా చాటాడు.
ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి పరిణతి కనబరిచాడు. తొలి చిత్రమే అయినా హీరోయిన్ అనఘ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగానూ మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు అర్జున్ జంద్యాల ఆ కథను మాస్ కమర్షియల్ స్టైల్‌లో చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు. మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.
రేటింగ్.2.75/5