Telugu Gateway
Telangana

పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన దామోదర్

పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన దామోదర్
X

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ క్లారిటీ ఇఛ్చారు. తాను పార్టీ మారటం లేదని..కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. కొంత మంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరినీ కలవటం లేదని..తనపై దుష్ప్రచారం మానుకోోవాలని సూచించారు. అంతకు ముందు ఎంపిక చేసిన ఛానళ్ళలో దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని..బిజెపిలో చేరుతున్నారని విస్తృతంగా ప్రచారం చేశాయి. అంతే కాదు..ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో కూడా రాజనర్సింహ బేటీ కానున్నట్లు ప్రచారం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు దామోదర్ రాజనర్సింహ భార్య బిజెపిలో చేరటం..అది రాజకీయంగా పెద్ద దుమారం రేపటంతో ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు.

సీనియర్ నేతగా ఉన్న దామోదర్ రాజనర్సింహ ఓ వైపు కాంగ్రెస్ లో ఉండగా..ఆయన భార్య బిజెపిలోకి వెళ్ళటం తప్పుడు సంకేతాలు పంపుతుందని నేతలు ఒత్తిడి చేయటంతో దామోదర్ భార్య బిజెపిలో చేరికను తూచ్ అన్నారు. అప్పటికి అంతా సద్దుమణిగింది. గత కొంత కాలంగా తెలంగాణలో బలం పుంజుకునే పనిలో భాగంగా వివిధ పార్టీల నేతలను ఆకర్షించే పనిలో ఉంది కమలదళం. ఈ తరుణంలో రాజనర్సింహపై మళ్ళీ ప్రచారం జోరుగా జరిగింది. చివరకు ఆయన ఖండించటంతో ప్రస్తుతాినికి వ్యవహరం సద్దుమణిగినట్లు అయింది.

Next Story
Share it