Telugu Gateway
Telangana

బిత్తిరిసత్తి ఇక టీవీ9లో

బిత్తిరిసత్తి ఇక టీవీ9లో
X

వీ6 న్యూస్ గురించి తెలిసిన వారెవరికైనా బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన ప్రత్యేక శైలిలో వార్తలు చెబుతూ..వ్యంగాస్త్రాలు సంధిస్తూ తెలంగాణలో వీ6 న్యూస్ ఛానల్ అగ్రస్థానంలో కొనసాగించటంలో సత్తి పాత్ర తక్కువేమీ కాదు. తీన్మార్ న్యూస్ తో సత్తి ఒక్క తెలంగాణలోనే కాదు..ఏపీలో కూడా చాలా పాపులర్. ఈ ప్రత్యేక శైలి వార్తలతో గుర్తింపు దక్కించుకున్న సత్తి ఏకంగా సినిమా ఛాన్స్ లు కూడా కొట్టేసి పలుమార్లు వెండితెరపై కూడా తళుక్కున మెరిశారు.

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అదే తరహాలో ఛానల్ రాజకీయాలు కూడా మారుతున్నాయి. ఇంత కాలం వీ6లో కీలక పాత్ర పోషించిన సత్తి ఆ ఛానల్ కు గుడ్ బై చెప్పి ఇప్పుడు టీవీ9లో చేరారు. అయితే టీవీ9లో సత్తి ప్రొగ్రామ్ ఎలా ఉంటుంది?. ఇప్పటికే నెంబర్ వన్ గా ఉన్న టీవీ9 ఛానల్ రేటింగ్ ను మరింత పెంచటంలో సత్తి ఏ మేరకు పాత్ర పోషిస్తారు అన్నది భవిష్యత్ లో వేచిచూడాల్సిందే. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి సంబంధించి ఇది కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చు.తొలుత సత్తి టీన్యూస్ లో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరకు వచ్చి టీవీ9లో ల్యాండ్ అయ్యారు.

Next Story
Share it