ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
BY Telugu Gateway1 Aug 2019 7:06 PM IST

X
Telugu Gateway1 Aug 2019 7:06 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం నాలుగు ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో ఒక సీటుకు, ఏపీలో మూడు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సభ్యుల రాజీనామాతో ఖాళీగా ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాలు. తెలంగాణ లో యాదవ రెడ్డిపై అనర్హత వేటు పడటంతో సీటు ఖాళీ అయింది.
ఈ ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్ తేదీ - 7 ఆగస్టు 2019
నామినేషన్ల స్వీకరణ - 14 ఆగస్టు 2019
స్క్రూటినీ - 15 ఆగస్టు 2019
నామినేషన్ విత్ డ్రా - 19 ఆగస్టు 2019
ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు - 26 ఆగస్టు 2019
ఆగస్ట్ 28వ తేదీ లోపు ఎన్నికలు పూర్తి
Next Story