Telugu Gateway
Politics

కాశ్మీర్ పై అనుపమ్ ఖేర్ ట్వీట్

కాశ్మీర్ పై అనుపమ్ ఖేర్ ట్వీట్
X

కాశ్మీర్..కాశ్మీర్. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే మాట. ఇంత వరకూ అసలు కాశ్మీర్లో ఏదో జరగబోతుందనే సంకేతాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అయితే అవి ఏంటి అన్నది సోమవారం నాడు బహిర్గతం కానుంది. కేంద్ర కేబినెట్ సమావేశం అయి..దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని..పార్లమెంట్ లో ప్రకటన చేయటానికి మోడీ సర్కారు రెడీ అవుతోంది. ఈ తరుణంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం నిజం అని తేలిపోయింది. అయితే కాశ్మీర్ లో ఏమి చేయబోతున్నది అనుమప్ ఖేర్ కు తెలిసినట్లు ఉందని...అదేంటో చెప్పాలని నెటిజన్లు ఆయన ట్వీట్ పై స్పందిస్తున్నారు. ఏళ్ల నాటి కశ్మీర్‌ సమస్యను పరిష్కారించేందుకు ఎ‍ట్టకేలకు చర్యలు ప్రారంభం అయ్యాయని ‘కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం ప్రారంభమైంది’ అంటూ పోస్ట్‌ చేశారు.

కొన్ని రోజులుగా కాశ్మీర్ కు భారీ ఎత్తున బలగాల తరలింపుతో కాశ్మీర్‌ను కేంద్రం పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆదివారం అర్థరాత్రి అనంతరం 144 సెక్షన్‌ అమలుతో పరిస్థితులు పూర్తిగా వేడెక్కాయి. ఇంటర్‌ నెట్‌ సేవలను నిలిపివేయడంతో పాటు.. పలు జిల్లాల్లో పూర్తి ఆంక్షాలను అమలుచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడంతో పాటు స్థానిక నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో కశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Next Story
Share it