Telugu Gateway
Telangana

హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ ప్రారంభం..కెసీఆర్ డుమ్మా

హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ ప్రారంభం..కెసీఆర్ డుమ్మా
X

ఈ కామర్స్ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అమెజాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ క్యాంపస్ బుధవారం నాడు ప్రారంభం అయింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తెలంగాణ సీఎం కెసీఆర్ హాజరు కావాల్సి ఉన్నా..ఆయన డుమ్మా కొట్టారు. ఆయన స్థానంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ ఈ క్యాంపస్ ను డెవలప్ చేసింది. దీని కోసం తెలంగాణ సర్కారు పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 2016 మార్చిలో ఈ క్యాంపస్ పనులకు శంకుస్థాపన జరగ్గా..2019 ఆగస్టు ఇది పూర్తిగా రెడీ అయింది. ఇందులో ఏకంగా పదిహేను వేల మంది పనిచేసే వెసులుబాటు ఉంటుంది. అందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టారు. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 అంతస్థులతో ఈ భవనాన్ని నిర్మించారు.

అత్యాధునిక మౌలికసదుపాయాలతో ఈ భవన నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అమెజాన్ హైదరాబాద్ కేంద్రంలో 7000 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ సంఖ్య పది వేలకు చేరనుందని కంపెనీ చెబుతోంది. అమెరికా వెలుపల అమెజాన్ నిర్మించిన అతిపెద్ద క్యాంపస్ కూడా ఇదే కావటం విశేషం. హైదరాబాద్ లో ఉన్న పలు సానుకూలతల దృష్ణా అగ్రశ్రేణి కంపెనీలు ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ ప్రగతి మరింత జోరుగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it