Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’
X

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. స్వాతంత్ర దినోత్సవం సంరద్భంగా చిత్ర యూనిట్ టైటిల్ ను ప్రకటించింది. ఈ సినిమాకు అల వైకుంఠపురంలో అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. టైటిల్ తోపాటు చిన్న టీజర్ కూడా కూడా విడుదల చేశారు.

టీజర్‌లో ‘ఏంటిరోయ్ గ్యాప్‌ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగ్గా.. ‘ఇవ్వలేదు.. వచ్చింది’ అంటాడు అల్లు అర్జున్‌. ఈ సినిమాను అల్లు అరవింద్, చినబాబు నిర్మిస్తున్నారు. ఇందులో టబు చాలా రోజుల తర్వాత ఓ కీలక పాత్రలో కన్పించనున్నారు. ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.

https://www.youtube.com/watch?v=hesTBbGRlaQ

Next Story
Share it