Telugu Gateway
Andhra Pradesh

పీపీఏల సమీక్షపై ముందుకే

పీపీఏల సమీక్షపై ముందుకే
X

విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన పీపీఏ సమీక్షపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం తెలిపారు. గత ప్రభుత్వంలో కుదిరిన అన్ని పీపీఏలను సమీక్షిస్తామని.. ఆ తర్వాత రద్దుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘పీపీఏలను రివ్యూ చేసే హక్కు రాష్ట్రానికి ఉంది. న్యాయస్థానాలు కూడా ఈ విధానాన్ని తప్పు పట్టవనే భావిస్తున్నా. భారాన్ని తగ్గించుకోవడం కరెక్ట్ కాదని ఎవరైనా భావిస్తే.. దానిపై నేను కామెంట్ చేయలేను. మార్కెట్ రేటు కంటే ఎక్కువగా రూ. 2500 కోట్లు ఏడాదికి చెల్లింపులు జరిగాయి. ఐదేళ్ల కాలంలో రూ. 12500 కోట్లు ఎక్కువ చెల్లింపులు జరిగాయి. పిపిఏలపై సమీక్షించి అవినీతికి పాల్పడిన వాటిపై చర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాబట్టేందుకు చర్చలు జరుగుతున్నాయి.’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ గాడి తప్పుతోంది. విద్యుత్ శాఖను గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయతిస్తున్నారు. గత మూడేళ్ళలో చేసుకున్న ఒప్పందాలు భారంగా మారాయి. పవన, సౌర విద్యుత్ రేట్లు జాతీయస్థాయిలో భారీగా తగ్గిందని కేంద్ర ఆర్థిక సర్వే ప్రకటించింది.

టెండర్లు పిలవకుండానే పవన, సౌర విద్యుత్ పిపిఏ లు జరిగాయి. పిపిఏ లు రద్దుకు ప్రభుత్వం నిర్ణయించిందని దీనివల్ల పెట్టుబడులు రావని కొందురు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల, ప్రభుత్వ ప్రయోజనాలకు ఈ ప్రచారాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 5వేల మెగావాట్ల విద్యుత్ పిపిఏ లేకుండా సోలార్ పవర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. పిపిఏ లపై కొందురు కావాలనే స్వార్థప్రయోజనాలు కోసం దుష్ప్రచారం చేస్తున్నారు . కేంద్రప్రభుత్వం కు చెందిన పవర్ ఇంజినీర్లు పిపిఏ లపై జగన్ సర్కార్ సమీక్ష సరైనదేనని చెప్పారు. ఏపీలో పీపీఏల్లో అవకతవకలు జరిగాయన్న అంశం కేంద్రం దృష్టిలో ఉండకపోవచ్చు. ఎవరైనా రిప్రజెంట్ చేస్తే.. ఆ మేరకు లేఖలు రాసి ఉండొచ్చు. రెగ్యులర్ అడ్మినిస్ట్రేషనులో భాగంగా ఈ లేఖలు వచ్చి ఉండొచ్చని తెలిపారు.

Next Story
Share it