అనంతపురంలో ‘వాల్మీకి’
BY Telugu Gateway2 July 2019 11:31 AM IST
X
Telugu Gateway2 July 2019 11:31 AM IST
వాల్మీకీ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సంచరిస్తున్నాడు. అదేంటి అంటారా?. ఇఫ్పుడు ఆ సినిమా షూటింగ్ అక్కడే సాగుతుంది మరి. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత హరీష్ తెరకెక్కిస్తున్న మూవీ ఇదే. తాజాగా విడుదల చేసిన ప్రీ టీజర్‌లో వరుణ్ లుక్ ఫ్యాన్స్ కు షాక్‌నిచ్చింది.
తమిళ సూపర్‌హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగెటివ్ రోల్ చేస్తుండగా.. మరో కీలకపాత్రలో అథర్వా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వాల్కీకి మూవీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story