ముగ్గురు భామలతో రవితేజ ‘డిస్కో’
BY Telugu Gateway9 July 2019 4:31 AM GMT

X
Telugu Gateway9 July 2019 4:31 AM GMT
రవితేజ ముగ్గురు భామలతో జోడీ కట్టనున్నారు. ఇదంతా డిస్కో రాజా సినిమా కోసమే. ఇప్పటికే ఇద్దరు భామలను ఖరారు చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మూడవ హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసింది. ఈ సినిమాలో మూడవ హీరోయిన్‌గా తాన్యా హోప్ ఎంపికయ్యారు.
ఇది వరకు ‘నేను శైలజా, అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్ సార్’ వంటి సినిమాల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ కథానాయికలు. రామ్ తాళ్లూరి నిర్మాత.
Next Story