Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ సినిమాతో టబు రీ ఎంట్రీ

అల్లు అర్జున్ సినిమాతో టబు రీ ఎంట్రీ
X

టబు. ఒకప్పుడు టాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన హీరోయిన్. కొన్ని సినిమాల్లో కుర్రకారును హీటెక్కించిన ఈ భామ తర్వాత టాలీవుడ్ కు దూరం అయింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇప్పుడు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అదీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను ప్రస్తుతం ‘ఏఏ19’గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో టబు లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అత్తారింటింకి దారేది సినిమాలో నదియా పాత్ర తరహాలోనే టబు పాత్రను డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు.

https://www.youtube.com/watch?time_continue=11&v=bCeG8fOWgtA

Next Story
Share it