సీక్రెట్ గా సినిమా చూసిన సమంత
BY Telugu Gateway6 July 2019 9:18 PM IST
X
Telugu Gateway6 July 2019 9:18 PM IST
‘ఓ..బేబీ’ సమంత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ ఓ రేంజ్ కు పెరిగిపోయింది. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల వరకూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ తరుణంలో సమంత సీక్రెట్ గా తాను నటించిన ఓ...బేబీ సినిమాను హైదరాబాద్ లోని దేవీ థియేటర్ వీక్షించింది. ఈ విషయాన్ని స్వయంగా సమంతే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను ఎవరకీ తెలియకుండా సినిమాను తెలిపింది.‘ దేవీ థియేటర్‌లో ఓ బేబీ చిత్రాన్ని ఎవరికీ తెలియకుండా చూశాను.
సినిమా చేస్తున్న ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన చూడాలంటే ఆ మాత్రం చేయాలి. ఇదే నా స్ఫూర్తి. థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ, నాగశౌర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సమంత నటనస సూపర్బ్ గా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు.
Next Story