Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ఎన్టీఆర్ లుక్

అదరగొడుతున్న ఎన్టీఆర్ లుక్
X

ఇది చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసిందా.. లేక అభిమానులు విడుదల చేసిందా?. క్లారిటీ లేదు కానీ..ఎన్టీఆర్ న్యూలుక్ మాత్రం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఈ కొత్త లుక్ సూపర్ గా ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దీన్నీ జోరుగా షేర్ చేస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర ను పోషించనున్నారు. వీళ్లిద్దరూ యువకులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారనే అంశంతో ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి ఇఫ్పటికే ప్రకటించారు.

ఇందులో కొంత వాస్తవ అంశాలు..కొన్ని కల్పితాలు కూడా ఉంటాయన్నారు. నిజానికి అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు యుక్త వయస్సులో ఎలా ఉన్నారో పెద్దగా ఎవరికీ తెలియదని రాజమౌళి చిత్ర వివరాలు ప్రకటించిన సమయంలోనే తెలిపారు. బాహుబలి వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత దాదాపు 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమాను డీ వీవీ దానయ్య నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Next Story
Share it