Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ జోడీ ఫిక్స్!

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ జోడీ ఫిక్స్!
X

మళ్ళీ విదేశీ భామే. మొదటి నుంచి కూడా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దర్శకుడు ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామపైనే ఫోకస్ పెట్టారు. కారణం బాహుశా మరి కథ అలా డిమాండ్ చేసి ఉంటుందేమో. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషించనుండగా, మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించనున్నారు. వీళ్లిద్దరూ కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో చూపిస్తానని రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కొంత వాస్తవం ఉంటుందని..మరి కొంత కల్పితం ఉంటుందని తెలిపారు.

తొలుత ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌కు జోడి సెట్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికన్‌ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ ను ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా ఫైనల్ చేశారని టాక్. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ భామ తొలిసారిగా ఓ భారతీయ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాలోఇప్పటికే రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ ను ఎంపిక చేశారు.

Next Story
Share it