Telugu Gateway
Cinema

సిగరెట్ తాగిన రకుల్...పొగ ‘చిన్మయి’కి

సిగరెట్ తాగిన రకుల్...పొగ ‘చిన్మయి’కి
X

రకుల్ ప్రీత్ సింగ్ మన్మథుడు2 సినిమాలో తన పాత్రలో భాగంగా సిగరెట్ తాగుతూ కన్పిస్తారు. అంతే కాదు గుప్పు గుప్పు మంటూ పొగ వదిలారు. ఇప్పుడు ఆ పొగ కాస్తా సింగర్ చిన్మయిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్ తాగితే ఆ పొగ ప్రభావం చిన్మయికి ఎందుకు తగిలింది అంటారా?. అక్కడే ఉంది అసలు కథ. రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్ దాగిన సన్నివేశం ఉన్న సినిమా దర్శకుడు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ అన్న విషయం తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే తెలుగులో సంచలన హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా హిందీలో ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై స్పందించిన చిన్మయి.. సందీప్‌ రెడ్డి వంగను ‘సినిమా తీసే పద్దతి ఇదేనా? ఆడవారిని అలా చూపించొచ్చా’ అంటూ దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడేమో చిన్మయి భర్త రాహుల్‌ రవీంద్రన్‌ తన సినిమాలో హీరోయిన్‌తో సిగరెట్‌ తాగించాడు. అంతేకాక బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా చెప్పించడంతో నెటిజన్లు చిన్మయికి చుక్కలు చూపిస్తున్నారు.

ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ, అందరికీ నీతులు చెబుతోంది అంటూ చిన్మయిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా అవంతిక పాత్రను పరిచయం చేస్తూ మన్మథుడు2 చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ డైలాగ్ లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయటం ద్వారా చిన్మయి చిక్కుల్లో పడినట్లు అయింది. రకుల్ సిగరెట్‌ సీన్‌కు అర్థం ఏంటంటూ ఆమెను పలువురు ప్రశ్నిస్తున్నారు. మీ భర్త చేస్తే ఒప్పు, మిగతావారు చేస్తే మాత్రం తప్పా? అంటూ నిలదీస్తున్నారు.

Next Story
Share it