Telugu Gateway
Andhra Pradesh

జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు ఏపీ ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రయోజనాలపై ఎక్కువ ప్రేమ ఉందని ఆరోపించారు. జగన్ చెబుతున్న జ్యుడిషియల్ కమిషన్ జరిగే పనికాదని..టెండర్ల విషయంలో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. పీపీఏలపై జగన్ సర్కారు అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై చంద్రబాబు బుధవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో విద్యుత్ ప్లాంట్ లు ఉన్న జగన్ అక్కడ ఎక్కువ ధరకు ఒప్పందాలు కుదుర్చుకుని..ఇక్కడ మాత్రం ధరలు ఎక్కువ అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పీపీఏల విషయంలో ప్రభుత్వం పాత నామమాత్రమని, పీపీఏలు సమీక్షిస్తామనడం సరికాదని ఆయన అన్నారు. నిరంతరం కరెంట్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకెళ్లామని, ఐదేళ్లకు ముందు భారీగా కరెంట్‌ కొరత ఉండేదని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు మిగులు విద్యుత్‌ని సాధించామన్నారు.

నిజాలు వక్రీకరిస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఎందుకు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు?, విద్యుత్‌ ధరలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంప్రదాయేతర ఇంధనాన్ని 5శాతానికి మించి తీసుకోరాదని.. అధికారి మీడియాకు తప్పుడు సమాచారం ఎలా ఇచ్చారు. 2021 నాటికి సాంప్రదాయేతర ఇంధనం 20శాతానికి చేరాలని చంద్రబాబు తెలిపారు. రెండు నెలల్లోనే విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్ధం చేసి చీకటి రోజులు తెచ్చారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎలాంటి క్విడ్ ప్రో కోలు లేవని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ముందకెళ్ళామని తెలిపారు.

Next Story
Share it