Telugu Gateway
Andhra Pradesh

తానా వేదికగా జగన్ పై పవన్ విమర్శలు

తానా వేదికగా జగన్ పై పవన్ విమర్శలు
X

‘నేను వచ్చింది నిజజీవితంలో మాట్లాడటానికి వచ్చాను. మీకు అండగా ఉండటానికి వచ్చాను. మనందరం కలసి కట్టుగా ఓ దిశగా ప్రయాణం చేయాలి. మనందరం ఒకటే ఆలోచనలో ఉండాలి. ఈ సభ తర్వాత ఎన్ని కామెంట్లు అయినా చేయనీయండి. నాకేమీ ఇబ్బంది లేదు. జైలుకెళ్ళి కూర్చుని..ఇబ్బందిలేని పరిస్థితులో వ్యక్తులు ఉన్నప్పుడు నాకేమీ ఇబ్బంది ఉంటుంది. ఓటమి, అపజయం అంటే నాకు భయం లేదు. ఎందుకంటే నేను స్కాంలు చేసో..ద్రోహాలు చేసో రాజకీయాల్లోకి రాలేదు. విలువల కోసం వచ్చా. విలువల కోసం నిలబడ్డా. ధైర్యంగా సమస్యలు చెప్పటానికి నిలబడ్డా. అది నాకు ఓటమి ఇస్తే..అపజయం ఇస్తే దాన్ని సంతోషం తీసుకుంటా. ఒక సత్యాన్ని మాట్లాడటానికి ఇక్కడ నుంచున్నా.’ అని పవన్ కళ్యాణ్ తానా సభల్లో వ్యాఖ్యానించారు. తానా సమావేశానికి వెళ్ళే అంశంపై కూడా చాలా మందితో మాట్లాడానని కొంత మంది వెళ్ళొద్దని..కొంత మంది వెళ్ళమని చెప్పారన్నారు.పేరు పెట్టకండానే పవన్ కళ్యాణ్ తానా వేదిక నుంచి ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది.

మనం అందరూ ఇంకా కులాల వారీగా..ప్రాంతాల వారీగా విడిపోయాల్సిన అవసరం ఉందా? అని పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. అందరం బాగుండాలని తానే కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సమాజంలో అసమానతలు తనను ఎక్కువగా బాధించాయని తెలిపారు. నా ఓటమి గురించి..అపజయం గురించి మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నా. ప్రతి అపజయం విజయానికి దారి అని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీని చాలా ఆలోచించే పెట్టాను. మనలో ఐక్యత లేదు. దెబ్బతింటుంది. ప్రతిసారి భయపడుతూ ఉంటే ఏ పనీ ముందుకు పోదు. జనసేన అపజయం నుంచి కోలుకోవటానికి జస్ట్ 15 నిమిషాలే పట్టింది. ఆ సమయంలో యాక్సెప్ట్ చేశా. చిన్నప్పుడు ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. ఫెయిల్యూర్ నాకు చాలా పాఠాలు నేర్పింది.

Next Story
Share it