Telugu Gateway
Cinema

నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్’ రిప్లయ్

నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్’ రిప్లయ్
X

నిధి అగర్వాల్. టాలీవుడ్ లో వరస పెట్టి ఆఫర్లు దక్కంచుకుంటోంది. ఈ భామ తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా జూన్ 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ అందాల ఆరబోతలో రెచ్చిపోయినట్లు కన్పిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ ను విడుదల చేసింది. దీన్ని హీరోయిన్ నిధి అగర్వాల్ షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ తప్ప ఏమైనా చేశారా’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన ఆమె ట్రైలర్ చూసి మాట్లాడొద్దు..సినిమా చూడండి చాలా చేశాను అంటూ టెంపర్ లూజ్ అవకుండా ‘ఇస్మార్ట్’ రిప్లయ్ ఇచ్చారు అంటున్నారు నెటిజన్లు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్‌ మరో హీరోయిన్‌గా నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆయన కూడా నిధి అగర్వాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సూర్యుడి కన్నా హాట్ గా ఉందంటూ కామెంట్ చేశారు. దీనిపై నిధి అగర్వాల్ కూడా స్పందిస్తూ..థ్యాంక్స్ చెబుతూ..తాను రంగీలా కు పెద్ద అభిమానిని అని తెలిపారు.

Next Story
Share it