Telugu Gateway
Cinema

‘గ్యాంగ్ లీడర్’ టీజర్ వచ్చేసింది

‘గ్యాంగ్ లీడర్’ టీజర్ వచ్చేసింది
X

హీరో నాని మరోసారి సందడి చేయటానికి రెడీ అయ్యాడు. జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ న్యాచురల్ స్టార్..గ్యాంగ్ లీడర్ తో కూడా దుమ్మురేపేలా ఉన్నాడు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ చూస్తుంటే నానికి మరో హిట్ ఖాయం అన్నట్లే కన్పిస్తోంది. అంతగా నవ్విస్తున్నాయి ఈ సినిమాలో సన్నివేశాలు మరి. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నిర్మాణ సంస్థ. ఇప్పటికే సినిమా షూటింగ్ కు సంబంధించి మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తికాగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్‌.

నానిని పెన్సిల్ పేరుతో పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నాని ఈ సినిమాలో రివేంజ్‌ స్టోరిల రచయితగా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటిస్తున్న కార్తికేయను రేసర్‌గా పరిచయం చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇతర పాత్రల్లో లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు అలరించనున్నారు.

https://www.youtube.com/watch?v=CLG-meEqQT4

Next Story
Share it