Telugu Gateway
Cinema

‘నేనే’ గ్యాంగ్ లీడర్ అంటన్న నాని

‘నేనే’ గ్యాంగ్ లీడర్ అంటన్న నాని
X

నాని ‘గ్యాంగ్ లీడర్’ షెడ్యూల్ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏమి చేయనున్నారో చెబుతూ హీరో నాని ట్వీట్ చేశారు. తొలుత గ్యాంగ్ లీడర్ ప్రీ లుక్ ను విడుదల చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లో ప్రధాన భాగం పూర్తి కావటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌.

ఈ నెల 15 ఫస్ట్ లుక్‌, 18న ఫస్ట్‌ సాంగ్‌, 24న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Next Story
Share it