Telugu Gateway
Telangana

తొంభై లక్షల ఎమ్మార్వో లావణ్య అరెస్ట్

తొంభై లక్షల ఎమ్మార్వో లావణ్య అరెస్ట్
X

తొంభై మూడు లక్షల రూపాయల నగదుతో పట్టుబడిన ఎమ్మార్వో లావణ్యను ఎమ్మార్వో లావణ్య అరెస్ట్ అయ్యారు. అంత భారీ మొత్తంలో ఆమె నివాసంలో నగదు దొరకటం పెద్ద కలకలమే రేపింది. నగదు కట్టలు కట్టలుగా ఉండటమే కాకుండా..బంగారం కూడా ఆమె నివాసంలో లభ్యమైంది. కేశవపేట్ తహశీల్థార్ లావణ్యను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆమెను గురువారం సాయంత్రంలోగా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె భర్త వెంకటేష్ నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతను మున్సిపల్ ఆడినిస్ట్రేట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామానికి చెందిన రైతు మామిడిపల్లి భాస్కర్ తన 9.07 ఎకరాల భూమి రికార్డుల్లో లేదని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. డబ్బులిస్తే తప్ప పని జరగదని కొందుర్గు వీఆర్ వో అనంతయ్య స్పష్టం చేశాడు.

మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని..అందులో తహశీల్దార్ లావణ్యకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని అనంతయ్య తెలిపాడు. తొలి విడతగా 30 వేల రూపాయలు వీఆర్ వోకి ఇఛ్చిన రైతు..తర్వాత అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు నాలుగు లక్షల రూపాయల నగదుతో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళి వీఆర్ వో డబ్బులు ఇస్తుండగా..ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కలిగిన ఉన్నట్లు తేలడంతో లావణ్యను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో లావణ్యను విచారిస్తున్నారు.

Next Story
Share it