Telugu Gateway
Politics

బిజెపిపై పారికర్ తనయుడి సంచలన వ్యాఖ్యలు

బిజెపిపై పారికర్ తనయుడి సంచలన వ్యాఖ్యలు
X

నిజంగానే బిజెపి రాజకీయ రంగు మారిపోతోంది. ఒకప్పటి కాంగ్రెస్ కి..ఇప్పటి బిజెపికి ఏ మాత్రం తేడా లేకుండా పోతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ కంటే దారుణంగా బిజెపినే వ్యవహరిస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. తాజాగా గోవాలోని రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి తన సిద్ధాంతాలను మర్చిపోయిందని.. కొత్త దారుల్లో వెళుతోందని విమర్శించారు. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. వారిలో 10 మంది బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అంతేగాక తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్పల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నాటి పార్టీ కాదిది. విశ్వాసం, నిబద్ధత పునాదులుగా పార్టీ నడిచేది. మార్చి 17 తర్వాత ఆ రెండు పదాలు పార్టీకి దూరమయ్యాయి. పార్టీ తన పంథాను పూర్తిగా మార్చుకుంది. చెప్పే సమయమని భావించి చెబుతున్నాను’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై బిజెపి ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it