Telugu Gateway
Politics

కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం

కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం
X

గత కొన్ని రోజులుగా సాగుతున్న కర్ణాటక రాజకీయం ఆదివారం నాడు కొత్త ట్విస్ట్ తీసుకుంది. సోమవారం నాడు కొత్త ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాసపరీక్షకు రెడీ అవుతున్న తరుణంలో స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలుత ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన రమేష్ కుమార్..ఆదివారం నాడు మరో 14 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై కూడా వేటు వేశారు. కుమారస్వామి సర్కారు కూలిపోవటంలో కీలక పాత్ర పోషించింది వీరే కావటం గమనార్హం. స్పీకర్ రమేష్ కుమార్ తాజాగా 13 మంది కాంగ్రెస్‌, ఓ స్వతంత్ర సభ్యుడిపై అనర్హత వేటు వేశారు. దీంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది. స్పీకర్‌ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.. దీంతో వారందరూ నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు.

సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్‌ ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తాను మాత్రం స్పీకర్‌ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది సభ్యులపై అనర్హత వేట పడడంతో.. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. దీంతో మేజిక్‌ ఫిగర్‌ 104కి చేరింది. బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యులు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది.

అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీరే..

కాంగ్రెస్‌

బస్వరాజు

మునిరత్నం

సోమశేఖర్‌

రోషన్‌బేగ్‌

ఆనంద్‌సింగ్‌

నాగరాజు

బీసీ పాటిల్‌

ప్రతాప్‌ గౌడ్‌

సుధాకర్‌

శివరాం హెబ్బర్‌

మంత్‌ పాటిల్‌

రమేష్‌ జార్జ్‌హోళి

మహేష్‌

జేడీఎస్‌

గోపాలయ్య

నారాయణ గౌడ్‌

విశ్వనాథ్‌

శంకర్‌(స్వతంత్ర)

Next Story
Share it