‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ పూర్తి
BY Telugu Gateway2 July 2019 10:41 AM GMT

X
Telugu Gateway2 July 2019 10:41 AM GMT
రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు నటించిన సినిమానే ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఛార్మి కౌర్ తో కలసి ఆయన సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాను జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రామ్ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. ఈ సినిమా దర్శకుడు పూరీ జగన్నాధ్ కు కూడా అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే గత కొంత కాలంగా ఆయనకు ఒక్కటంటే ఒక్క హిట్ లేదు.
Next Story