Telugu Gateway
Cinema

‘ఇస్మార్ట్ శంకర్’లా చేసేరు..దెబ్బడిపోద్ది

‘ఇస్మార్ట్ శంకర్’లా చేసేరు..దెబ్బడిపోద్ది
X

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో హాట్ హాట్ సన్నివేశాలతో హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ లు రెచ్చిపోయారు. డైలాగ్ లు సైతం అదే తరహాలో ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా గురువారం నాడే విడుదల కానుంది. గతంలో పూరి దర్శకత్వంలో వహించిన దేశముదురు, పోకిరి, బిజినెస్‌మేన్‌ లాంటి సినిమాలు ఏ సర్టిఫికేట్‌తోనే సూపర్‌ హిట్‌ అయ్యాయి.

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్‌ విషయంలోనూ అదే సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ అంశంపై రామ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమాల్లో ప్రారంభమయ్యే ముందు వేసే స్టాట్యూటరీ వార్నింగ్‌ తరహాలో ‘ధూమపానం, మద్యపానంతో పాతో ఇస్మార్‌ శంకర్‌లా నిజ జీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్‌ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్‌ గా వ్యవహరించండి ’ అంటూ సూచించారు.

Next Story
Share it