Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు వీరే

ఏపీలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు వీరే
X

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది రోజుల క్రితమే ఈ పేర్లను ఖరారు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. పదమూడు జిల్లాలకు పదమూడు మందిని నియమించారు. శ్రీకాకుళం జిల్లాకు వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లాకు రంగనాధరాజు, విశాఖపట్నానికి మోపిదేవి వెంకటరమణ, తూర్పు గోదావరికి ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాకు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు బాధ్యతలు అప్పగించారు.

కృష్ణా జిల్లాకు కె.కన్నబాబు, గుంటూరు జిల్లాకు పేర్నినాని , ప్రకాశం జిల్లాకు అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లాకు సుచరిత, చిత్తూరు జిల్లాకు మేకపాటి గౌతం రెడ్డి, కడపకు బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, కర్నూలు జిల్లాకు బొత్స సత్యనారాయణ,అనంతపురానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ చార్జి మంత్రులుగా వ్యవహరిస్తారు. జిల్లాలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.

Next Story
Share it