న్యూలుక్ లో గోపీచంద్
BY Telugu Gateway4 July 2019 3:39 PM GMT

X
Telugu Gateway4 July 2019 3:39 PM GMT
గోపీచంద్ ‘చాణక్య’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ హీరో న్యూలుక్ లో కన్పిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కొత్త లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ నెలాఖరుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది.
మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Next Story