Telugu Gateway
Andhra Pradesh

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
X

ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సెషన్ అంతటికి బహిష్కరణకు గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గోదావరి జలాలకు సంబంధించిన అంశంపై సమాధానం ఇస్తున్న తరుణంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

దీంతో నలుగురు ఎమ్మెల్యేలను ఒక్క రోజు సెషన్ నుంచి బహిష్కరించారు. సస్పెండ్ కు గురైన వారిలో అశోక్, వాసుపల్లి గణేష్, బాలాంజనేయులు, వెలగపూడి రామకృష్ణలు ఉన్నారు. సస్పెండ్ అయిన వారిని మార్షల్స్ సాయంతో బయటకు పంపారు.

Next Story
Share it